ఇన్ స్టాలో మహేశ్ దూకుడు.. 6 మిలియన్ క్లబ్బులో చేరిక!

24-11-2020 Tue 21:38
  • ఇటీవలే ఇన్ స్టాలో చేరిన మహేశ్ 
  • వేగంగా 60 లక్షల ఫాలోవర్లు రాక
  • ట్విట్టర్లో 11 మిలియన్ ఫాలోవర్లు  
Maheshbabu joins Six million club in Instagram

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా దూసుకుపోతున్నాడు. ఇప్పుడు సామాన్యులు సహా సెలబ్రిటీలు కూడా ఎక్కువగా యాక్టివ్ గా ఉంటున్న సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 60 లక్షల ఫాలోవర్స్ ను సంపాదించుకుని 6 మిలియన్ క్లబ్బులో చేరాడు.

తను ఇన్ స్టాలోకి వచ్చి ఎంతో కాలం కానప్పటికీ, అత్యంత వేగంగా ఇంతమంది ఫాలోవర్లను సొంతం చేసుకోవడం విశేషమనే చెప్పాలి. దీంతో ఆయన అభిమానులు ఈ విషయాన్ని హైలైట్ చేసుకుంటూ పోస్టులతో పండగ చేసుకుంటున్నారు. మరోపక్క, ట్విట్టర్లో కూడా మహేశ్ హవా కొనసాగుతోంది. ఇప్పటికి దాదాపు 11 మిలియన్ ఫాలోవర్స్ తో అక్కడ కూడా దూసుకుపోతున్నాడు.

ఇదిలావుంచితే, ప్రస్తుతం మహేశ్ తన తాజా చిత్రాన్ని పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. 'సర్కారు వారి పాట' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కథానాయికగా నటించనుంది.