'భాగమతి' హిందీ రీమేక్ టైటిల్ మార్పు
- అనుష్క నాయికగా వచ్చిన 'భాగమతి'
- భూమి ఫడ్నేకర్ తో హిందీలో రీమేక్
- 'దుర్గావతి' టైటిల్ 'దుర్గామతి'గా మార్పు
- డిసెంబర్ 11న అమెజాన్ ప్రైమ్ లో విడుదల
తెలుగు మాతృకకు దర్శకత్వం వహించిన అశోక్ దీనికి కూడా దర్శకత్వం వహించాడు. ఇక కథానాయికగా భూమి ఫడ్నేకర్ నటించింది. దీనికి మొదట్లో 'దుర్గావతి' అనే పేరును నిర్ణయించారు. అయితే, తాజాగా దీనిని కాస్త సవరించారు. 'దుర్గామతి'గా ఈ టైటిల్ని మార్చడం జరిగింది.
ఇక బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఈ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. వచ్చే నెల 11న అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ద్వారా ఇది విడుదల కానుంది.