లోకేశ్ కాన్వాయ్ ని తనిఖీ చేసిన హైదరాబాద్ పోలీసులు!

24-11-2020 Tue 11:34
  • జూబ్లీహిల్స్ నుంచి విజయవాడ బయలుదేరిన లోకేశ్
  • ఇల్లు దాటగానే కాన్వాయ్ ని ఆపిన పోలీసులు
  • కోడ్ కారణంగానే తనిఖీలు చేశామన్న అధికారులు
Hyderabad Police Search Nara Lokesh Convoy

ఈ ఉదయం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పరిధిలో తెలుగుదేశం పార్టీ యువనేత, ఏపీ మాజీ మంత్రి నారా లోకేశ్ కాన్వాయ్ ని పోలీసులు తనిఖీ చేశారు. తన నివాసం నుంచి విజయవాడకు ఆయన బయలుదేరగా, కాన్వాయ్ గేటు దాటగానే పోలీసులు ఆపారు. ఆపై అన్ని వాహనాలనూ తనిఖీ చేసి పంపారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికలు జరుగుతుండటం, కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలోనే తనిఖీలు జరిపినట్టు పోలీసులు వెల్లడించారు. తనిఖీల అనంతరం లోకేశ్ కాన్వాయ్ విజయవాడకు బయలుదేరి వెళ్లింది.