INOX: థియేటర్లు తెరిచేందుకు శరవేగంగా ఏర్పాట్లు: ఐనాక్స్

  • సినిమా హాల్స్ తెరిచేందుకు తెలంగాణ ఉత్తర్వులు
  • నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం
  • ఐనాక్స్ సౌత్ రీజియన్ డైరెక్టర్ మోహిత్ భార్గవ
INOX Getting Ready to Reopen Theaters

సినిమా హాల్స్, మల్టీ ప్లెక్స్ లను తిరిగి ప్రారంభించుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో మల్టీప్లెక్స్ చైన్ ను నిర్వహిస్తున్న ఐనాక్స్ శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ నిబంధనలు, విధివిధానాలకు అనుగుణంగా పలు చర్యలను తీసుకుంటున్నామని ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ సౌత్ రీజియన్ డైరెక్టర్ మోహిత్ భార్గవ వెల్లడించారు. బుకింగ్ కౌంటర్ల వద్ద కేవలం ఈ-టికెట్లను మాత్రమే జారీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఇందుకోసం ఆల్ ఇన్ వన్ బుకింగ్ కన్ఫర్మేషన్ ఎస్ఎంఎస్ వస్తుందని, ఇది నాలుగు విభిన్న లింక్స్ నుంచి వస్తుందని తెలిపారు.

తొలి లింక్ లో క్యూఆర్ కోడ్ ను ఉపయోగించి ధియేటర్ లోకి చెక్-ఇన్ కావచ్చని, రెండో లింక్ ద్వారా ఆడిటోరియంలో ప్రేక్షకుడు కూర్చునే చోటును చూపించే చార్ట్ ఉంటుందని, మూడవ లింక్ లో ఫుడ్ అండ్ బీవరేజ్ మెనూ చూసుకుని, ఆర్డర్ ను ప్లేస్ చేసుకోవచ్చని, నాలుగో లింక్ అన్ని రకాల వివరాలతో కూడిన ఈ-టికెట్ రూపంలో ఉంటుందని అన్నారు. ఫుడ్ కౌంటర్ల వద్ద అందుబాటులో ఉంచిన క్యూఆర్ కోడ్ లను స్కాన్ చేసి కూడా ఆహారాన్ని పొందవచ్చని ఆయన అన్నారు.

ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా 50 శాతం సామర్థ్యానికి మించకుండానే ప్రేక్షకులను అనుమతిస్తామని, ప్రేక్షకుల కుడి, ఎడమవైపు ఖాళీ తప్పనిసరి చేశామని, ప్రవేశద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ ఉంటుందని మోహిత్ భార్గవ తెలిపారు. ప్రతి షో తరువాత సీట్,ఆడిటోరియం శానిటైజేషన్ నిర్వహిస్తామని, శానిటైజర్ డిస్పెన్సర్లను ఎక్కడికక్కడ అందుబాటులో ఉంచనున్నామని తెలిపారు.

More Telugu News