అధికార మార్పిడికి అంగీకరించిన డొనాల్డ్ ట్రంప్!
- ఏం చేయాలో అది చేయండి
- సాధారణ పరిపాలనా సేవల విభాగానికి ట్రంప్ సూచన
- ట్రంప్ నిర్ణయాన్ని స్వాగతించిన బైడెన్ టీమ్
కాగా, నవంబర్ 3న ఎన్నికలు ముగిసిన తరువాత, బైడెన్ విజయం ఖాయమైనప్పటికీ, ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లు రిగ్గింగ్ కు పాల్పడ్డారని, తాను బైడెన్ విజయాన్ని అంగీకరించబోనని చెబుతూ మూడు వారాల పాటు కాలం గడిపిన ట్రంప్, పెన్సిల్వేనియా, జార్జియా న్యాయస్థానాల్లో చుక్కెదురైన అనంతరం మనసు మార్చుకున్నారు. ఇక ట్రంప్ నిర్ణయాన్ని బైడెన్ టీమ్ స్వాగతించింది. అధికార బదిలీ శాంతియుతంగా, సాఫీగా సాగాలన్నదే తమ అభిమతమని పేర్కొంది.