రెండో పెళ్లి రేపిన చిచ్చు... ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

23-11-2020 Mon 17:52
  • రాజమండ్రిలో విషాద ఘటన
  • భర్త రెండో పెళ్లి చేసుకోవడంతో యువతి మనస్తాపం
  • తల్లి, ఇద్దరు పిల్లలతో కలిసి యువతి ఆత్మహత్య
Four family members commits suicide in Rajahmundry

రాజమండ్రిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి రెండో పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో ఆ కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. శివపావని (27), భూపతి నాగేంద్రకుమార్ భార్యాభర్తలు. వీరికి నిషాన్ (9), రితిక (7) అనే ఇద్దరు పిల్లలున్నారు. అయితే నాగేంద్రకుమార్ రెండో పెళ్లి చేసుకున్నాడని తెలియడంతో శివపావని తీవ్రమనస్తాపానికి గురైంది. దాంతో ఆమె తన తల్లి, ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది.

శివపావని, ఆమె తల్లి సంగిశెట్టి కృష్ణవేణి (55) తొలుత పిల్లలకు విషం ఇచ్చారు. చిన్నారులు అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత వారిద్దరూ ఉరేసుకుని బలవన్మరణం చెందారు. ఈ ఘటనతో రాజమండ్రి అంబేద్కర్ నగర్ లో విషాద వాతావరణం నెలకొంది.