దుబ్బాక విజయం స్ఫూర్తితో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ గెలుస్తాం: బాబూ మోహన్
- తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్న బాబు మోహన్
- అనంతరం మీడియాతో మాట్లాడిన నేత
- దుబ్బాకలో బీజేపీ గెలవడం అంటే కేసీఆర్‌ని ఓడించినట్టే
- బీజేపీలోకి నాయకుల చేరికలు పెరిగాయి
ఈ రోజు తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఇటీవల దక్కిన దుబ్బాక విజయం స్ఫూర్తితో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుస్తామని చెప్పారు. దుబ్బాకలో బీజేపీ గెలవడం అంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఓడించినట్టేనని తెలిపారు. బీజేపీలోకి నాయకుల చేరికలు పెరిగాయని చెప్పారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు.