ఏపీలో పలువురు ఉన్నత అధికారులకు పోస్టింగులు, బదిలీలు

22-11-2020 Sun 18:27
  • సర్వే సెటిల్ మెంట్ కమిషనర్ గా సిద్ధార్థ్ జైన్
  • రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీగా శేషగిరిబాబు
  • సురబాలకృష్ణను మాతృశాఖకు పంపిస్తూ ఉత్తర్వులు
 Postings and Transfers in Andhra Pradesh

ఏపీలో పలువురు ఉన్నత అధికారులకు స్థానచలనం కలిగింది.  స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ సిద్ధార్థ్ జైన్ ను బదిలీ చేశారు. సర్వే సెటిల్ మెంట్ కమిషనర్ గా ఆయనకు పోస్టింగు ఇచ్చారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీగా ఎంవీ శేషగిరిబాబును నియమించారు. ఏపీ టవర్స్ సీఈవోగా ఎం.రమణారెడ్డిని, ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీగా కె.రవీన్ కుమార్ రెడ్డిని నియమించారు.

విద్య, సంక్షేమ వసతుల అభివృద్ధి సంస్థ ఎండీగా సీహెచ్ రాజేశ్వరరెడ్డికి పోస్టింగు ఇచ్చారు. ఇక, డిప్యుటేషన్ లో ఉన్న సురబాలకృష్ణను మాతృశాఖకు పంపిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఐఆర్ఎస్ అధికారి లిఖిమ్ శెట్టిని ఐఎంఎస్ డైరెక్టర్ గా నియమించారు.