హైదరాబాదును మేం చూసుకుంటాం... కేటీఆర్ అమెరికాకు, కేసీఆర్ ఫాంహౌస్ కు పోవాలి: రఘునందన్

22-11-2020 Sun 14:45
  • రాజుకున్న జీహెచ్ఎంసీ ఎన్నికల వేడి
  • బీజేపీ అభ్యర్థుల తరఫున రఘునందన్ ప్రచారం
  • టీఆర్ఎస్ నేతలపై విమర్శలు
Raghunandan comments onTRS top brass

గ్రేటర్ ఎన్నికల్లో ఈసారి ప్రధాన పోరు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా మారింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయంతో బీజేపీలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. టీఆర్ఎస్ ను జీహెచ్ఎంసీ బరిలో మట్టికరిపిస్తామంటూ ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.  టీఆర్ఎస్ నేతలు అవినీతికి మారుపేరుగా తయారయ్యారని, హైదరాబాద్ అభివృద్ధికి టీఆర్ఎస్ ఏమీ చేయలేదని విమర్శించారు.

హైదరాబాద్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని అన్నారు. హైదరాబాదు అభివృద్ధి అంశాన్ని తాము చూసుకుంటామని, కేసీఆర్ ఫాంహౌస్ కు, కేటీఆర్ అమెరికాకు పోవాలని వ్యంగ్యం ప్రదర్శించారు. మౌలాలి డివిజన్ లో బీజేపీ అభ్యర్థి సునీతా యాదవ్ తరఫున రఘునందన్ రావు ఇవాళ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగానే ఆయన పైవ్యాఖ్యలు చేశారు.