Moderna: తమ వ్యాక్సిన్ ధరను ప్రకటించిన మోడెర్నా సీఈఓ!

  • ఒక్కో డోస్ ధర 25 నుంచి 37 డాలర్ల మధ్య
  • ఈయూతో డీల్ పై చర్చలు జరుగుతున్నాయి
  • జర్మనీ పత్రిక 'వామ్స్'కు ఇంటర్వ్యూలో స్టిఫానీ బాన్సెల్
Moderna CEO Comments on Vaccine Price

తాము తయారు చేసిన కరోనా టీకా ఒక్కో డోస్ కు 25 డాలర్ల నుంచి 37 డాలర్ల మధ్య వసూలు చేయనున్నామని మోడెర్నా చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టిఫానీ బాన్సెల్ వెల్లడించారు. జర్మనీ పత్రిక 'వామ్స్'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, వివిధ దేశాల ప్రభుత్వాలకు ఈ ధర వర్తిస్తుందని అన్నారు. ప్రస్తుతం ఫ్లూకు తీసుకునే వ్యాక్సిన్ల ధరలు 10 డాలర్ల నుంచి 50 డాలర్ల వరకూ ఉన్నాయని, తమ వ్యాక్సిన్ ధర కూడా అదే రేంజ్ లో ఉంటుందని ఆయన అన్నారు.

కాగా, మోడెర్నాతో వ్యాక్సిన్ కోసం డీల్ కుదుర్చుకునేందుకు యూరోపియన్ యూనియన్ అధికారులు సోమవారం నాడు సమావేశం కానున్నారు. ఒక్కో డోస్ 25 డాలర్లపై 10 లక్షల డోస్ లను సరఫరా చేయాలని ఈయూ కోరనుంది. అయితే, తాము ఇంతవరకూ ఈయూ కమిషన్ సహా మరెవరితోనూ వ్యాక్సిన్ ను అందించేందుకు ఒప్పందాలు కుదుర్చుకోలేదని, పలు దేశాలతో చర్చలు జరుపుతున్నాయని, అతి త్వరలోనే ఒప్పందాలు కుదురుతాయని ఆశిస్తున్నామని అన్నారు.

మోడెర్నా వ్యాక్సిన్ కొవిడ్ పై 94.5 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని ట్రయల్స్ నివేదికలు వెల్లడించిన సంగతి తెలిసిందే. అంతకుముందు పిఫైజర్ వ్యాక్సిన్ విడుదల చేసిన నివేదికల్లో, వారి వ్యాక్సిన్ 92 శాతానికి పైగా పనిచేస్తోందని ప్రకటించింది.

More Telugu News