వారిద్దరినీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో సస్పెండ్ చేసింది: పొన్నం ప్రభాకర్

21-11-2020 Sat 18:33
  • బీజేపీ, టీఆర్ఎస్ లు తెలంగాణకు చేసిందేమీ లేదు
  • వరద సాయం పేరుతో టీఆర్ఎస్ నేతలు దోచుకున్నారు
  • 2009 ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటాం
Congress suspended them long back says Ponnam Prabhakar

బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలపై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. గత ఆరేళ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ లు తెలంగాణకు చేసిందేమీ లేదని విమర్శించారు. వరదల పేరుతో టీఆర్ఎస్ నేతలు జేబులు నింపుకునే ప్రయత్నం చేశారని అన్నారు. టీఆర్ఎస్ నేతల దోపిడీని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకున్న విషయాన్ని ప్రజలందరూ గమనించారని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు డమ్మీ ఫైట్ చేస్తున్నాయని దుయ్యట్టారు.

బీజేపీ నేతలు అర్ధరాత్రి కాంగ్రెస్ నేతల ఇళ్లలోకి వెళ్తున్నారని... బీజేపీలోకి చేర్చుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ మేయర్ బండ కార్తీకలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో సస్పెండ్ చేసిందని... వీరిని పార్టీలో చేర్చుకున్నామని బీజేపీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 2009 జీహెచ్ఎంసీ ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలను ఈసారి కాంగ్రెస్ గెలుచుకుంటుందని అన్నారు.