నాగశౌర్య సినిమాతో టాలీవుడ్ కి మరో కొత్త హీరోయిన్

21-11-2020 Sat 18:14
  • అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య సినిమా 
  • ఇటీవలే ప్రారంభమైన సినిమా షూటింగ్
  • కథానాయికగా షిర్లీ సెషియా పరిచయం
  • షిర్లీ ఆక్లాండ్ కు చెందిన ప్రముఖ గాయని
New heroine introdeced in Naga Shouryas film

టాలీవుడ్ కి ఎప్పుడూ ఎవరో ఒకరు కొత్త కథానాయికలు వస్తూనే వుంటారు. కొత్తదనం కోసం మన దర్శక నిర్మాతలు అలా నూతన కథానాయికలను పరిచయం చేస్తుంటారు. ఈ క్రమంలో వివిధ భాషలలోని న్యూ టాలెంట్ ను వెతికి పట్టుకుని మరీ తీసుకొస్తూ వుంటారు. అలా ఇప్పటికి మన తెలుగు సినిమాకి ఎందరో కొత్త కథానాయికలు వచ్చారు. అదే కోవలో ఇప్పుడు షిర్లీ  సెషియా కూడా చేరుతోంది. యంగ్ హీరో నాగశౌర్య సరసన ఆమె నటించనుంది.

అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా తాజాగా ఓ చిత్రం రూపొందనుంది. ఐరా క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. ఇప్పుడీ చిత్రంలో కథానాయికగా షిర్లీని ఎంపిక చేశారు. ఆక్లాండ్ కి చెందిన ఈ  25 ఏళ్ల అమ్మాయి బేసికల్ గా గాయని. ఫోర్బ్స్ మేగజైన్ లో స్థానం కూడా పొందింది.

ఆమధ్య నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన 'మస్కా' సినిమాతో నటిగా మారింది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి ప్రవేశించి 'నికమ్మా' చిత్రంలో నటిస్తోంది. ఈ సమయంలో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ నుంచి ఈ ఆఫర్ వచ్చిందన్న మాట!