మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రభుదేవా.. ధ్రువీకరించిన సోదరుడు రాజు సుందరం

21-11-2020 Sat 17:53
  • డాక్టర్ హిమనిని పెళ్లి చేసుకున్న ప్రభుదేవా
  • పెళ్లి పట్ల మా కుటుంబం సంతోషంగా ఉందన్న రాజు సుందరం
  • 1995లో తొలి వివాహం చేసుకున్న ప్రభుదేవా
Prabhudeva gets second marriage

ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా రెండో పెళ్లి చేసుకున్నాడంటూ కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. తన బంధువుల అమ్మాయిని ప్రభు పెళ్లి చేసుకున్నాడని కొన్ని కథనాలు వచ్చాయి. ఫిజియోథెరపిస్ట్ ను పెళ్లాడాడని మరికొన్ని వార్తలు వచ్చాయి. ఈ పెళ్లి వార్తలపై ప్రభుదేవా సోదరుడు రాజు సుందరం స్పందించాడు. పెళ్లి సమాచారం అంతా మీ వద్దే ఉందని... ప్రభుదేవా వివాహం పట్ల తమ కుటుంబం అంతా సంతోషంగా ఉందని చెప్పాడు.

1995లో రామలత అనే మహిళను ప్రభుదేవా వివాహం చేసుకున్నాడు. 16 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల వీరు విడిపోయారు. ఇప్పుడు ముంబైకి చెందిన డాక్టర్ హిమనిని ప్రభు పెళ్లి చేసుకున్నాడని రాజు సుందరం చెప్పాడు. మరోవైపు, పెళ్లికి ముందు ప్రభుదేవా, హిమని రెండు నెలల పాటు సహజీవనంలో ఉన్నట్టు తెలుస్తోంది.