పంచెకట్టుతో నేచురల్ స్టార్ నాని... కొత్త సినిమా టైటిల్ విడుదల.. ఆసక్తికర సంభాషణతో ఆడియో!

21-11-2020 Sat 13:11
  • వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో సినిమా
  • ‘అంటే సుందరానికీ’ అనే ఆసక్తికర టైటిల్
  • ఓ ఆడియో కూడా విడుదల
  • సినిమాపై మరింత ఆసక్తిని రేపుతున్న డైలాగులు
Presenting the CurtainRaiser of Nani28 AnteSundaraniki

‘టక్‌ జగదీశ్’, ‘శ్యామ్ ‌సింగరాయ్‌’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న నేచురల్ స్టార్ నాని మరింత దూకుడు పెంచాడు. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న తన 28వ సినిమా పేరును కూడా ఆయన ప్రకటించాడు.  ఈ సినిమాకి ‘అంటే సుందరానికీ’ అనే ఆసక్తికర టైటిల్ పెట్టారు. ఓ ఆడియోను కూడా విడుదల చేసి ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు.

ఏదో సీక్రెట్‌ గురించి మాట్లాడుకుంటున్నట్లు ఇందులో వినిపించి, సస్పెన్స్ లో పెట్టారు. 
‘ఏంటీ అలా చెవులు కొరుక్కుంటున్నారు?’ రని హర్ధవర్థన్ అంటాడు. దీనిపై సుహాస్ స్పందిస్తూ... ‘ఓ విషయం చెప్పాలి సర్’ అంటాడు. ఆ తర్వాత చెవిలో ఏదో రహస్యం గురించి వారు మాట్లాడుకుంటున్నట్లు ఇందులో వినిపించారు. చివరకు ‘అంటే సుందరానికీ...’ అంటూ చివరికి సస్పెన్స్ లో పెట్టారు.

చివరగా సుందరం పాచికలు వేయమందువా? అని ఒకరు అంటారు. దీంతో తనదైన శైలిలో నాని నవ్వుతాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఈ సినిమా యూనిట్ విడుదల చేసింది.  నాని లగేజ్‌ బ్యాగ్‌ పట్టుకుని, పంచెకట్టుకుని వెనకవైపు తిరిగి నించున్నట్లు లుక్‌ విడుదల చేశారు. త్వరలోనే సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుందని తెలిపారు.  2021లో ఈ సినిమా ద్వారా ఫన్‌ను ఎంజాయ్‌ చేయవచ్చని పేర్కొన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.