ఫోన్ లో డేటా వాడేసుకున్నాడని తమ్ముడ్ని చంపేసిన అన్న

20-11-2020 Fri 20:28
  • రాజస్థాన్ లో దారుణం
  • అన్న ఫోన్ లో ఇంటర్నెట్ డేటా వాడుకున్న తమ్ముడు
  • కత్తితో ఛాతీలో పొడిచిన అన్న
Man stabbed his brother to death

రాజస్థాన్ లో ఘోరం జరిగింది. తన ఫోన్ లోని డేటాను తమ్ముడు పూర్తిగా వాడేశాడన్న కోపంతో ఓ యువకుడు హత్యకు పాల్పడిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. జోథ్ పూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. రమణ్, రాయ్ అన్నదమ్ములు. అయితే రాయ్ కారణంగా తన ఫోన్ లోని ఇంటర్నెట్ డేటా మొత్తం అయిపోయిందని భావించిన రమణ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఇంటి మేడపై తమ్ముడితో గొడవపడ్డాడు.

మాటామాటా పెరగడంతో రాయ్ ఛాతీలో కత్తితో పొడిచి పరారయ్యాడు. నాలుగైదు కత్తిపోట్లు తగలడంతో రాయ్ తీవ్రరక్తస్రావంతో కుప్పకూలిపోయాడు. అతడిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. కాగా, రైల్వేస్టేషన్ లో ఉన్న రమణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి మానసిక పరిస్థితి సరిగాలేదని భావిస్తున్నారు.