Sarvey Sathyanarayana: కాంగ్రెస్ కు షాక్... బీజేపీలో చేరుతున్నానని సర్వే సత్యనారాయణ ప్రకటన

I am joining BJP says Sarvey Sathyanarayana
  • ఐదారు నెలలుగా బీజేపీ నేతలు నన్ను సంప్రదిస్తున్నారు
  • ఢిల్లీలో హైకమాండ్ సమక్షంలో బీజేపీలో చేరుతా
  • ఆ తర్వాత నేను ఏం చేస్తానో చెపుతా
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈరోజు సర్వే నివాసానికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ వెళ్లి, పార్టీలో చేరాలని ఆయనను ఆహ్వానించారు. అనంతరం మీడియాతో సర్వే మాట్లాడుతూ, తాను బీజేపీలో చేరుతున్నానని ప్రకటన చేశారు.

గత ఐదు, ఆరు నెలలుగా బీజేపీ నేతలు, ఆ పార్టీ కేంద్ర నాయకత్వం తనను సంప్రదిస్తోందని చెప్పారు. బీజేపీలో చేరడానికి ఇదే సరైన సమయమని అన్నారు. త్వరలోనే తాను ఢిల్లీకి వెళ్లి బీజేపీ హైకమాండ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకుంటానని చెప్పారు. పార్టీ హైకమాండ్ తో చర్చించిన తర్వాత తాను ఏమి చేస్తానో చెపుతానని అన్నారు. మరి కొందరు కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
Sarvey Sathyanarayana
Congress
BJP
Bandi Sanjay

More Telugu News