Anasuya: అనసూయ సినిమా పోస్టర్ ను లాంచ్ చేసిన రానా

Rana Daggubati launches title poster of Thank You Brother
  • బుల్లితెరతో పాటు వెండితెరపై రాణిస్తున్న అనసూయ
  • 'థాంక్యూ బ్రదర్' చిత్రంలో నటిస్తున్న అనసూయ
  • కరోనా సమయంలో కథల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం
ఓవైపు యాంకర్ గా బుల్లితెరపై రాణిస్తూనే... మరోవైపు వెండి తెరపై కూడా సత్తా చాటుతోంది అనసూయ. 'సోగ్గాడే చిన్నినాయన', 'రంగస్థలం' చిత్రాలతో అనసూయ రేంజ్ అమాంతం పెరిగింది. తాజాగా 'థాంక్యూ బ్రదర్' అనే చిత్రంలో అనసూయ నటిస్తోంది. కరోనా సమయంలో జరిగిన కొన్ని కాల్పనిక కథల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ ను సినీ నటుడు రానా దగ్గుబాటి లాంచ్ చేశారు. ఒక లిఫ్ట్ వద్ద మాస్క్ కింద పడిన దృశ్యం పోస్టర్ లో ఉంది. ఈ చిత్రానికి రమేశ్ రాపర్తి దర్శకత్వం వహిస్తున్నారు.
Anasuya
Rana Daggubati
Thank You Brother Movie
Tollywood

More Telugu News