గ్రేటర్ ఎన్నికలు: టీఆర్ఎస్ పార్టీ తుది జాబితా విడుదల

20-11-2020 Fri 13:34
 • మొదటి జాబితాలో 105 మంది అభ్యర్థుల పేర్లు
 • రెండో జాబితాలో 20 మంది  
 • ఈ రోజు మిగతా 25 మంది పేర్లు వెల్లడి
 •  నామినేషన్ల స్వీకరణకు నేడే చివరి తేదీ  
trs releases candidates final list

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తుది జాబితాను టీఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది. మొదటి జాబితాలో ఆ పార్టీ 105 మంది అభ్యర్థుల పేర్లు,  రెండో జాబితాలో 20 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రోజు మిగతా 25 మంది పేర్లను ప్రకటించింది. నామినేషన్ల స్వీకరణకు నేడే చివరి తేదీ కావడంతో నేటితో అందరు అభ్యర్థులు నామినేషన్లు సమర్పించాల్సి ఉంది. దీంతో ఈ రోజు అన్ని డివిజన్ల నుంచి భారీగా నామినేషన్లు వస్తున్నాయి.


టీఆర్ఎస్ రెండో జాబితాలోని అభ్యర్థులు వీరే..

 • ఏఎస్‌రావునగర్- పావనిరెడ్డి
 • చర్లపల్లి-బొంతు శ్రీదేవి యాదవ్
 • మీర్‌పేట్-ప్రభుదాస్
 • నాచారం-సాయిజెన్‌ శేఖర్
 • చిలకనగర్-బన్నాల ప్రవీణ్‌ ముదిరాజ్
 • హబ్సిగూడ-బేతి స్వప్న రెడ్డి,
 • ఉప్పల్-అరిటికాయల భాస్కర్
 • అత్తాపూర్-మాధవి
 • కాచిగూడ-శిరీష యాదవ్
 • నల్లకుంట-గరిగంటి శ్రీదేవి
 • అంబర్‌పేట-విజయ్‌కుమార్ గౌడ్
 • అడిక్‌మెట్-హేమలతారెడ్డి
 • ముషీరాబాద్ - భాగ్యలక్ష్మి యాదవ్
 • కవాడిగూడ- లాస్య నందిత
 • తార్నాక-మోతే శ్రీలత
 • యూసఫ్‌గూడ-రాజ్‌కుమార్ పటేల్
 • వెంగళ్ ‌రావు నగర్-దేదీప్య రావు
 • రెహమత్ నగర్-సీఎన్ రెడ్డి
 • నేరేడ్‌మెట్-మీనా ఉపేందర్‌రెడ్డి
 • ఈస్ట్ ఆనంద్‌బాగ్-ప్రేమ్‌కుమార్
 • గౌతమ్‌నగర్-మేకల సునీత రాముయాదవ్
 • గోల్‌నాక-దూసరి లావణ్య
 • చందానగర్-మంజుల రఘునాథ్‌రెడ్డి
 • హైదర్‌నగర్-నార్నె శ్రీనివాస్‌ రావు 
 • మౌలాలి-ముంతాజ్ ఫాతిమ