‘గ్రేటర్’ వార్.. 56 మందితో నాలుగో జాబితాను విడుదల చేసిన బీజేపీ

20-11-2020 Fri 06:54
  • ఇప్పటికే మూడు జాబితాలు విడుదల
  • మొత్తం 129 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
  • గత రాత్రి 90 మందితో టీడీపీ తొలి జాబితా
BJP released 4th list for ghmc elections

జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ, తన అభ్యర్థుల జాబితాలను వరుసపెట్టి విడుదల చేస్తోంది. ఇప్పటికే మూడు జాబితాలను విడుదల చేసిన ఆ పార్టీ గత రాత్రి నాలుగో జాబితాను విడుదల చేసింది. ఇందులో 56 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. దీంతో కలిపి ఇప్పటి వరకు మొత్తం 129 మంది అభ్యర్థులను ప్రకటించింది.

మరోవైపు, గత ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ కూడా సర్వశక్తులు ఒడ్డేందుకు ప్రయత్నిస్తోంది. గత రాత్రి 90 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. గ్రేటర్ ఎన్నికల్లో గణనీయమైన స్థానాలు సాధించి ఉనికి కాపాడుకోవాలని టీడీపీ భావిస్తోంది. కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి నారా లోకేశ్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.