బన్నీ అంటే ఇష్టం... స్టయిలిష్ స్టార్ పై టీమిండియా మహిళా క్రికెటర్ అభిమానం

19-11-2020 Thu 22:11
  • బ్యాట్స్ ఉమన్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియా పునియా
  • గతేడాది టీమిండియాలో ఎంట్రీ
  • సోషల్ మీడియాలో అభిమానులతో చాటింగ్
Team India woman cricketer Priya Punia said she likes Allu Arjun very much

గతేడాది టీమిండియా మహిళా జట్టుకు ఎంపికై, కొద్దికాలంలోనే గుర్తింపు తెచ్చుకున్న క్రికెటర్ ప్రియా పునియా. జైపూర్ కు చెందిన 24 ఏళ్ల ప్రియా ప్రధానంగా బ్యాట్స్ ఉమన్. ఇప్పటివరకు 5 వన్డేలు ఆడి 175 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 75 నాటౌట్.  అయితే, తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ తన మనోభావాలను పంచుకుంది. తనకు సౌతిండియా స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని పేర్కొంది. దాంతో బన్నీ అభిమానుల ఆనందం ఇంతాఇంతా కాదు.

అంతేకాదు, తనకిష్టమైన వంటకం రాజస్థానీ చుర్మా లడ్డూ అని తెలిపింది. ఇక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అన్న ప్రశ్నకు సమాధానంగా ఓ వీడియోలో తన ఎక్స్ ప్రెషన్ ను వెల్లడించడం విశేషం. కాగా, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కోచ్ రాజ్ కుమార్ శర్మ వద్దనే ప్రియా పునియా కూడా శిక్షణ పొందింది.