జీహెచ్ఎంసీ ఎన్నికలు: 90 మందితో టీడీపీ తొలిజాబితా విడుదల

19-11-2020 Thu 21:50
  • ఊపందుకున్న గ్రేటర్ ఎన్నికల రాజకీయాలు
  • అభ్యర్థులను ప్రకటిస్తున్న పార్టీలు
  • అభ్యర్థుల ఎంపికపై టీడీపీ కసరత్తులు
TDP releases first list of GHMC candidates

గ్రేటర్ ఎన్నికల సమరాంగణంలో అన్ని పార్టీలు అభ్యర్థుల జాబితాల ప్రకటన చేస్తున్నాయి. తాజాగా టీడీపీ 90 మందితో తొలి జాబితా విడుదల చేసింది. గత కొన్నిరోజులుగా టీడీపీ అధినాయకత్వం జీహెచ్ఎంసీ బరిలో దిగే అభ్యర్థులపై కసరత్తులు చేస్తోంది.  కీలకమైన ప్రాంతాలతో కూడిన తొలిజాబితాలో విజయావకాశాలు మెరుగ్గా ఉన్నవారిని ఎంపిక చేశారు.  

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కాకముందు జంటనగరాల్లో టీడీపీ బలంగా ఉనికిని చాటుకుంది. కాలక్రమంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం, టీఆర్ఎస్ ప్రాబల్యం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు బీజేపీ కూడా దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం ఇచ్చిన ఉత్సాహంతో జీహెచ్ఎంసీ బరిలో దిగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అవకాశాలు ఎలా ఉంటాయన్నది కాలమే చెప్పాలి. కాగా, గ్రేటర్ ఎన్నికల కోసం టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ ప్రచారానికి వస్తారని తెలుస్తోంది.