ఆఫీసు భవనం పైనుంచి దూకి టెక్ మహీంద్రా ఉద్యోగిని బలవన్మరణం

19-11-2020 Thu 15:45
  • హైదరాబాదులో ఘటన
  • ప్రేమ వ్యవహారమే కారణమంటున్న పోలీసులు
  • మృతదేహం ఉస్మానియాకు తరలింపు
Tech Mahindra employ in Hyderabad commits suicide

హైదరాబాదులో ఓ యువతి తాను పనిచేస్తున్న కార్యాలయ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ యువతి పేరు సుస్మిత. 21 సంవత్సరాల సుస్మిత స్వస్థలం హైదరాబాదులోని నామాలగుండు ప్రాంతం. ఆమె ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రాలో ఉద్యోగం చేస్తోంది. ఎప్పట్లానే ఈ ఉదయం సికింద్రాబాద్ గోపాలపురంలో ఉన్న తన ఆఫీసుకు వెళ్లిన సుస్మిత భవనం పైనుంచి దూకి బలవన్మరణం చెందింది.

ఆమె మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సుస్మిత ఆత్మహత్య వెనుక ప్రేమ వ్యవహారం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.