త్వరలో గుమ్మడికాయ కొట్టనున్న ప్రభాస్ 'రాధేశ్యామ్'

19-11-2020 Thu 15:21
  • ఇటీవలే ఇటలీలో చిత్రీకరణ జరుపుకున్న ప్రభాస్ కొత్త చిత్రం
  • ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో షూటింగ్
  • దాదాపు పూర్తికావొచ్చిన రాధేశ్యామ్
Prabhas new movie Radheshyam shooting almost completed

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'రాధేశ్యామ్'. ఈ భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ మరికొన్నిరోజుల్లో ముగియనుంది. ఇటీవలే ఇటలీ షెడ్యూల్ పూర్తిచేసుకున్న 'రాధేశ్యామ్' ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో చివరిదశ షూటింగ్ జరుపుకుంటోంది. సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తికాగా, మిగిలిన కొన్ని సన్నివేశాలను ఫిలింసిటీలోని భారీ సెట్ లో షూట్ చేస్తున్నారు.

ఇటీవలే ఈ సినిమాలో ప్రభాస్, పూజా ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా, సోషల్ మీడియాలో స్పందన అదిరిపోయింది. ఈ జంట అత్యంత రొమాంటిక్ గా ఉందంటూ కామెంట్లు వెల్లువెత్తాయి. 'సాహో' తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం ఇదే. ఈ సినిమాకి 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ పీరియాడిక్ లవ్ స్టోరీ మూవీని గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ కలసి నిర్మిస్తున్నాయి.