uae: పలు దేశాల ప్రజలకు విజిటింగ్ వీసాలను రద్దు చేసిన యూఏఈ!

UAE Suspend 12 Countries Visas
  • పలు దేశాల్ల పెరుగుతున్న కరోనా కేసులు
  • విజిటింగ్ వీసాలను సస్పెండ్ చేసిన యూఏఈ
  • పాక్ సహా 12 దేశాలపై తాత్కాలిక నిషేధం
రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో, పలు దేశాల పౌరులకు జారీ చేసిన విజిటింగ్ వీసాలను రద్దు చేస్తున్నట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ స్పష్టం చేసింది. కొత్త వీసాల జారీని సైతం నిలిపివేయనున్నామని అధికారులు స్పష్టం చేశారు. పాకిస్థాన్ సహా మొత్తం 12 దేశాల ప్రజలపై ఈ తాత్కాలిక నిషేధం అమలవుతుందని విదేశాంగ శాఖ ప్రతినిధి జాహిద్ హఫీజ్ చౌధురి వెల్లడించారు.

టర్కీ, ఇరాన్, యమన్, సిరియా, ఇరాక్, సోమాలియా, లిబియా, కెన్యా, ఆఫ్గనిస్థాన్ దేశాల వాసులకు జారీ చేసిన వీసాలపైనా నిషేధం అమలులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గడచిన వారం రోజులుగా పాకిస్థాన్ లో రోజుకు 2 వేలకు పైగా కొత్త కరోనా కేసులు వస్తున్న సంగతి తెలిసిందే. మిగతా దేశాల్లోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. కాగా, యూఏఈ నుంచి పాకిస్థాన్ కు గత జూన్ నుంచి ఎమిరేట్స్ విమాన సర్వీసులు రద్దయిన సంగతి తెలిసిందే.
uae
Pakistan
Visa
Suspend

More Telugu News