సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

19-11-2020 Thu 07:18
  • 'లవ్ స్టోరీ' షూటింగ్ పూర్తి చేసిన శేఖర్ కమ్ముల 
  • దుబాయ్ నుంచి తిరిగొచ్చిన ఎన్టీఆర్ ఫ్యామిలీ
  • రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టిన 'గాలి సంపత్'  
Shekar Kammulas Love Story completed its shoot

*  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందుతున్న 'లవ్ స్టోరీ' చిత్రం షూటింగ్ ముగిసింది. నిజామాబాద్ పరిసరాల్లో ఇటీవల చివరి పాటను చిత్రీకరించారు. దీంతో షూటింగ్ మొత్తం పూర్తయింది.
*  వారం క్రితం ఫ్యామిలీతో కలసి హాలిడే కోసం దుబాయ్ వెళ్లిన హీరో ఎన్టీఆర్.. తన ట్రిప్ ముగించుకుని నిన్న తిరిగి హైదరాబాదుకు చేరుకున్నాడు. రేపటి నుంచి తిరిగి 'ఆర్ఆర్ఆర్' చిత్రం షూటింగులో పాల్గొంటాడని తెలుస్తోంది.
*  యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో 'గాలి సంపత్' పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నిన్నటి నుంచి హైదరాబాదులో జరుగుతోంది. ఇందులో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ హీరోకి తండ్రిగా కీలక పాత్ర పోషిస్తున్నారు.