జీహెచ్ఎంసీ ఎన్నికలు: రెండో జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్

19-11-2020 Thu 06:51
  • ఊపందుకున్న ‘గ్రేటర్’ పోరు
  • పోటాపోటీగా అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్న పార్టీలు
  • 16 మందితో కాంగ్రెస్ రెండో జాబితా, 21 మందితో బీజేపీ తొలి జాబితా
Congress released second list for GHMC Elections

జీహెచ్ఎంసీ ఎన్నికల సమరాంగణం ఊపందుకుంది. ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థుల ప్రకటనలో బిజీగా ఉన్నాయి. నిన్న రాత్రి 29 మందితో కూడిన తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించిన కాంగ్రెస్.. రాత్రి పొద్దుపోయాక రెండో విడత జాబితాను విడుదల చేసింది. ఇందులో 16 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఫలితంగా రెండు విడతల్లోనూ కలిపి మొత్తం 45 మంది అభ్యర్థులను ప్రకటించింది.

నేడు మరో విడత జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు, బీజేపీ కూడా 21 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితా విడుదల చేసింది. టీఆర్ఎస్ గత రాత్రి 105 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేయగా, నేడు 45 మంది అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేస్తామని తెలిపింది.