అయోధ్య దీప కాంతులకు గిన్నిస్ రికార్డు!

18-11-2020 Wed 12:08
  • రామ్ కీ పైడీ స్నాన ఘాట్ల వద్ద దీపోత్సవం
  • 6 లక్షలకు పైగా దీపాలను వెలిగించిన ప్రజలు
  • గుర్తించిన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్
Ayodhya Deepotsavam in Gunnis Records

దీపావళి పర్వదినం నాడు సరయూ నది తీరాన ఉన్న అయోధ్య పరిధిలోని రామ్ కీ పైడీ స్నాన ఘాట్ల వద్ద ఒకేసారి 6,06,569 దీపాలు దాదాపు ఐదు నిమిషాల పాటు వెలుగులను విరజిమ్మగా, ఆ దీపకాంతులకు గిన్నిస్ రికార్డు లభించింది.

ఈ దీపోత్సవాన్ని అతిపెద్ద దీపోత్సవంగా గుర్తిస్తున్నట్టు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. దీపోత్సవానికి ఏర్పాట్లు చేసిన రాష్ట్ర టూరిజం విభాగానికి, రామ్ మనోహర్ లోహియా యూనివర్శిటీకి అభినందనలు తెలుపుతూ, ఆకాశం నుంచి డ్రోన్ల సాయంతో తీసిన చిత్రాలను గిన్నిస్ బుక్ పంచుకుంది.

 కాగా, వర్శిటీకి చెందిన 8 వేల మంది విద్యార్థులు ఎంతో శ్రమించి, ఈ దీపోత్సవానికి ఏర్పాట్లు చేశారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రశంసించారు. కాగా, 2017లో యోగి ఆదిత్యనాథ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రతి యేటా సరయూ తీరాన్ని దీపాలతో అందంగా అలంకరిస్తున్నారు. ప్రతి సంవత్సరమూ దీపాల సంఖ్యను పెంచుతూ వస్తున్నారు.