నిమ్స్‌లో కొనసాగుతున్న క్లినికల్ ట్రయల్స్.. మరో 10 మంది వలంటీర్లకు కొవాగ్జిన్ టీకా

18-11-2020 Wed 10:00
  • మూడో దశ ప్రయోాగాల్లో 800 మంది వలంటీర్లకు టీకా
  • ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఐసీఎంఆర్‌కు నివేదిక
  • 28 రోజుల తర్వాత బూస్టర్ డోస్
Covaxin vaccine clinical trial in NIMS enters third phase

భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా టీకా కోవాగ్జిన్‌కు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో క్లినికల్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రయోగాలు మూడో దశకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా నిన్న మరో 10 మంది వలంటీర్లకు టీకా ఇచ్చారు. ఈ విషయాన్ని నిమ్స్ ప్రత్యేక వైద్య బృందం వెల్లడించింది.

మరో 28 రోజుల తర్వాత వీరికి బూస్టర్ డోస్ ఇస్తారు. మూడో దశ ప్రయోగాల్లో మొత్తం 800 మంది వలంటీర్లు పాల్గొంటారని వైద్య బృందం తెలిపింది. రోజుకు కొంతమందికి డోస్ ఇవ్వనున్నారు. కాగా, ప్రయోగాల్లో పాలు పంచుకున్న వలంటీర్ల ఆరోగ్యంపై వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)కు వైద్యులు ఎప్పటికప్పుడు నివేదిక పంపిస్తున్నారు.