అమరావతిని రాజధానిగా గుర్తిస్తామని బీజేపీ కేంద్ర నాయకత్వం చెప్పింది: పవన్ కల్యాణ్

18-11-2020 Wed 06:22
  • అమరావతి రైతులు, మహిళలతో జనసేనాని సమావేశం
  • మహిళలే రాజధాని ఉద్యమాన్ని నడిపించాలన్న పవన్
  • జనసేన అండగా ఉంటుందని హామీ
BJP central leadership says it will recognize Amravati as capital Pawan Kalyan

జనసేనాని పవన్ కల్యాణ్ ఈ సాయంత్రం అమరావతి రైతులు, రాజధాని మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతిని రాజధానిగా గుర్తిస్తామని బీజేపీ కేంద్ర నాయకత్వం చెప్పిందని స్పష్టం చేశారు. రైతులు, ఆడపడుచుల కన్నీళ్లు పాలకులను దహించివేస్తాయని అన్నారు.

అమరావతి ఉద్యమాన్ని ఆడపడుచులే ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. రైతులకు బేడీలు వేసి ప్రభుత్వం తన పరువు దిగజార్చుకుందని పవన్ విమర్శించారు. రైతులపై మోపిన అట్రాసిటీ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాజధాని రైతులకు జనసేన ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.