china: హిమాలయ సరిహద్దుల్లో భారత సైనికులపై రహస్య అస్త్రం ప్రయోగించిన చైనా!

China launches covert attack on Indian troops on Himalayan border
షార్ట్స్‌లో చూడండి
చైనా ఎంత జిత్తులమారి దేశమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ వైపు చర్చలు అంటూనే మరోవైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టిస్తుంటుంది. ఇటీవల కాలంలో భారత్ తిరుగులేని విధంగా ఆయుధ పాటవం పెంచుకుంటోంది. విదేశీ అస్త్రాలే కాకుండా, దేశీయంగా అభివృద్ధి చేసిన అత్యాధునిక ఆయుధాలతో చైనాకు గట్టి సవాల్ విసురుతోంది. ఈ నేపథ్యంలో చైనా భారత సైనికులను దొంగదెబ్బ తీసిందని తాజా ఘటనతో వెల్లడవుతోంది.

హిమాలయ పర్వత సానువుల్లో సరిహద్దుల వద్ద విధులు నిర్వర్తిస్తున్న భారత సైనికులపై రహస్య అస్త్రం ప్రయోగించిందని అంతర్జాతీయ అధ్యయనాల నిపుణుడు జిన్ కాన్రాంగ్ అనే ప్రొఫెసర్ బీజింగ్ లో తన విద్యార్థులకు తెలిపారు. ఈ మైక్రోవేవ్ ఆయుధం ప్రయోగిస్తే కంటికి కనిపించని సూక్ష్మ విద్యుదయస్కాంత తరంగాలు మానవ శరీరంపై నిశ్శబ్దంగా దాడిచేస్తాయని వెల్లడించారు. మైక్రోవేవ్ ఓవెన్ లో నీటి అణువులు ఎలా వేడి అవుతాయో, ఈ విద్యుదయస్కాంత ఆయుధాలు ప్రయోగించినప్పుడు మనిషి చర్మం కింద ఉన్న నీటిని ఈ సూక్ష్మతరంగాలు టార్గెట్ చేస్తాయని, దాంతో మనిషి విపరీతమైన నొప్పితో బాధపడడమే కాకుండా, వాంతులు కూడా చేసుకుంటాడని వివరించారు.

సరిహద్దు నిబంధనలు ఉల్లంఘించకుండా భారత సైనికులను దెబ్బతీసే ఈ ఎత్తుగడను చైనా ఎంతో తెలివిగా అమలు చేసిందని ప్రొఫెసర్ కాన్రాంగ్ తెలిపారు. హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఈ ఆయుధాలను చైనా మోహరించిన 15 నిమిషాలకే సమీపంలోని భారత సైనికులు వాంతులు చేసుకోవడం మొదలుపెట్టారని, వారు కనీసం నిలబడలేకపోయారని దాంతో అక్కడ్నించి వెంటనే వెళ్లిపోయారని పేర్కొన్నారు.

దాంతో చైనా బలగాలు తాము కోల్పోయిన భాగాలను మళ్లీ చేజిక్కించుకున్నాయని అన్నారు. భారత సైనికుల్లో పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేయడంలో కాకలుతీరిన టిబెటన్ యోధులు ఉండడంతో చైనా సైన్యం ఈ సూక్ష్మతరంగాలను ఆయుధాలుగా చేసుకుందని ప్రొఫెసర్ కాన్రాంగ్ తన విద్యార్థులకు తెలిపారు.
Go Back to Shorts
china

More Telugu News