Sensex: ఆల్ టైమ్ హైకి చేరుకున్న మార్కెట్లు

  • 315 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 94 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 6 శాతానికి పైగా పెరిగిన టాటా స్టీల్ షేర్
Sensex closes 315 points high

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ వస్తోందనే వార్తలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 44 వేల పాయింట్లను తాకి 44,161కి చేరుకుంది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 315 పాయింట్లు లాభపడి 43,953కి చేరుకుంది. నిఫ్టీ 94 పాయింట్లు పెరిగి 12,874 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (6.24%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (4.59%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.81%), బజాజ్ ఫైనాన్స్ (2.62%), యాక్సిస్ బ్యాంక్ (2.50%).

టాప్ లూజర్స్:
ఎన్టీపీసీ (-2.69%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.87%), ఓఎన్జీసీ (-1.86%), ఇన్ఫోసిస్ (0.85%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-0.66%).

More Telugu News