నాకు పారిపోవడం తెలియదు, ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటా: పవన్ కల్యాణ్
- మంగళగిరిలో జనసేన క్రియాశీలక సమావేశాలు
- దేనిపైనైనా అభిప్రాయం స్పష్టంగా చెబుతానన్న పవన్
- ఏపీకి అమరావతి ఒక్కటే రాజధాని అని ఉద్ఘాటన
సమస్యను ఎత్తిచూపితే వ్యక్తిగత దూషణలకు దిగడం మినహా, సమస్యను పరిష్కరిద్దామన్న ఆలోచన పాలకులు, అధికార పక్షంలో లేదని విమర్శించారు. తనకు సమస్యల నుండి పారిపోవడం తెలియదని, ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటానని తెలిపారు. దేనిపైనైనా అభిప్రాయం చెప్పాల్సి వచ్చినప్పుడు స్పష్టంగా చెబుతానని అన్నారు.
పాలకులు పరిస్థితులకు తగ్గట్టు మాట మార్చేస్తుంటారని, అమరావతి విషయంలో అదే జరిగిందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. విభజించి పాలించే విధానంతో ముందుకెళుతున్నారని ఆరోపించారు. ఏపీకి అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలనేది జనసేన అభిప్రాయం అని ఉద్ఘాటించారు.