మిమ్మల్ని ఆ సీటులో కూర్చోబెట్టినందుకు బీజేపీకి శుభాకాంక్షలు: చిరాగ్ పాశ్వాన్

16-11-2020 Mon 21:16
  • బీహార్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నితీశ్
  • తక్కువ సీట్లు వచ్చినా సీఎం అయిన నితీశ్
  • నితీశ్ పై విమర్శలు గుప్పిస్తున్న ప్రత్యర్థులు
Chirag Pashwan targets Nitish Kumar

బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో కేవలం 40 సీట్లు మాత్రమే సాధించినప్పటికీ.... జేడీయూ నేత నితీశ్ కుమార్ మరోసారి సీఎంగా ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. ఎన్డీయే పొత్తులో భాగంగా సీఎం పదవిని చేపట్టే అవకాశాన్ని నితీశ్ కుమార్ కు బీజేపీ కల్పించింది. ఈ నేపథ్యంలో నితీశ్ పై పలువురు నేతలు వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు.

ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నితీశ్ కుమార్ కు శుభాకాంక్షలు అని చిరాగ్ ట్వీట్ చేశారు. సీఎం అయినందుకు మీకు... మిమ్మల్ని సీఎం చేసినందుకు బీజేపీకి శుభాకాంక్షలు అని ఎద్దేవా చేశారు. చిరాగ్ పాశ్వాన్ బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ... నితీశ్ కుమార్ కు మాత్రం పూర్తి వ్యతిరేకంగా ఉన్న సంగతి తెలిసిందే.