ఏపీ మంత్రి పెద్దిరెడ్డికి లీగల్ నోటీసులు పంపిన జడ్జి రామకృష్ణ

16-11-2020 Mon 19:03
  • తనను జడ్జి కాదన్నారని మంత్రిపై ఆరోపణలు
  • తన పరువుకు భంగం కలిగించారని వ్యాఖ్య 
  • క్షమాపణలు చెప్పాలని డిమాండ్
Judge Ramakrishna sends legal notices to minister Peddireddy

చిత్తూరు జిల్లాలో జడ్జి రామకృష్ణ, వైసీపీ నేతల మధ్య కొన్నాళ్లుగా వైరం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జడ్జి రామకృష్ణ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో మంత్రి పెద్దిరెడ్డి తన పరువుప్రతిష్ఠలకు భంగం కలిగించారంటూ జడ్జి రామకృష్ణ ఆరోపణలు చేశారు.

తనను జడ్జి కాదంటూ మంత్రి వ్యాఖ్యానించారంటూ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.  తనకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని, లేదంటే చట్టం ముందు దోషిలా నిలబడాలని అన్నారు. ఈ మేరకు ఆయన మంత్రికి లీగల్ నోటీసులు పంపారు. వైసీపీ సర్కారుపై బురద చల్లే ఉద్దేశం తనకులేదని ఆయన స్పష్టం చేశారు.