దర్శకుడు గోపిచంద్ మలినేనితో శ్రుతి హాసన్ డ్యాన్స్... వైరల్ అవుతోన్న వీడియో‌

16-11-2020 Mon 13:15
  • రవితేజ హీరోగా ‘క్రాక్’‌ సినిమా
  • గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో చిత్రం
  • ఇబ్బంది పడుతూనే డ్యాన్స్ చేసిన గోపిచంద్ మలినేని
sruti dance goes viral

గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా ‘క్రాక్’‌ సినిమా రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే. ఇందులో నటిస్తోన్న శ్రుతి హాసన్ సరదాగా డ్యాన్స్ చేస్తూ గోపిచంద్ మలినేనితోనూ చేయించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మొదట శ్రుతి హాసన్ డ్యాన్స్ చేస్తుండగా గోపిచంద్ మలినేని చూస్తూ ఉండిపోయారు.

అనంతరం కలసి డ్యాన్స్ చేద్దామని ఆయనకు శ్రుతి చెప్పింది. ఇబ్బంది పడుతూనే ఆయన డ్యాన్స్ చేసినట్లు ఈ వీడియో ఉంది. సూపర్ అంటూ శ్రుతి నవ్వుతూ ప్రశంసించింది. కాగా,  క్రాక్ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పాటలకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్, సముద్రఖని ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.