Chandrababu: భగవంతుడు రామోజీరావుగారికి సంపూర్ణ ఆయురారోగ్య ఆనందాలను ప్రసాదించాలి: చంద్రబాబు

Chandrababu wishes Ramoji Rao on hi birthday
  • నేడు పుట్టినరోజును జరుపుకుంటున్న రామోజీరావు
  • స్వయంకృషితో ఎంతో ఎత్తుకు ఎదిగారని చంద్రబాబు కితాబు
  • సామాజిక విలువలను పెంపొందించారని ప్రశంస
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు ఈరోజు తన 83వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 'ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, స్వయం కృషితో ఎన్నో సంస్థలకు అధిపతిగా ఎదిగి.. వేలాదిమందికి ఉపాధిని కల్పించిన శ్రీ రామోజీరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. పత్రికాధిపతిగా సామాజిక విలువలను పెంపొందించడమే కాకుండా, సాహితీ వికాసానికి, తెలుగు భాషాభ్యుదయానికి, రైతాంగానికి ఆయన చేస్తోన్న సేవలు ప్రశంసనీయం. భగవంతుడు రామోజీరావుగారికి సంపూర్ణ ఆయురారోగ్య ఆనందాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను'  అని ట్వీట్ చేశారు.
Chandrababu
Telugudesam
Ramoji Rao
Birthday

More Telugu News