ప్రియురాలు మోసం చేసిందంటూ కెనడాలో ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ యువకుడు

15-11-2020 Sun 20:57
  • ఉద్యోగరీత్యా కెనడాలో ఉంటున్న పుచ్చకాయల ప్రణయ్
  • నైట్రోజన్ గ్యాస్ పీల్చి తనువు చాలించిన ప్రణయ్ 
  • ప్రేమలో మోసపోయానంటూ సూసైడ్ నోట్
Hyderabad youth commits suicide in Canada

ప్రేమలో మోసపోయానన్న వేదనతో ఓ తెలుగు యువకుడు కెనడాలో ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ లోని హబ్సీగూడకు చెందిన పుచ్చకాయల ప్రణయ్ ఉద్యోగరీత్యా కెనడాలో ఉంటున్నాడు. ప్రణయ్... అఖిల అనే యువతిని ప్రేమించాడు. అయితే ఆ యువతి తనను మోసం చేసిందని భావించిన ప్రణయ్ నైట్రోజన్ గ్యాస్ పీల్చి తనువు చాలించాడు.

తన మరణానికి కారణం ప్రేమ వ్యవహారం, ప్రేమలో మోసపోయానని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. అంతేకాదు, తన అవయవాలను అవసరమైన వారికి దానం చేయాల్సిందిగా కోరాడు. కాగా ఈ ఆత్మహత్యపై కెనడాలోని భారత దౌత్య అధికారులు హైదరాబాదులోని ప్రణయ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనతో ప్రణయ్ కుటుంబంలో విషాదం నెలకొంది.