namrata: మ‌రో చిన్నారికి ఆపరేషన్ చేయించిన హీరో మ‌హేశ్ బాబు. ఫొటో పోస్ట్ చేసిన నమ్రత

God bless the child and the family says namrata
  • గుండె శస్త్రచికిత్సకు సాయం 
  • చిన్నారి ఆపరేషన్ సక్సెస్
  • సంతోషంగా ఉందన్న నమ్రత
ఇప్పటికే చాలా మంది చిన్నారుల చికిత్సకు సాయం చేసిన సినీ నటుడు మ‌హేశ్ బాబు మరో చిన్నారి గుండె శస్త్రచికిత్సకు సాయం చేశాడు. తన భర్త మరో చిన్నారికి సాయం చేసిన విషయాన్ని నమ్రతా శిరోద్కర్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో తెలిపింది. దీపావళి పర్వదినాన టపాసులు కాల్చడానికి బదులుగా ఒక మొక్కని నాటితే కాలుష్యాన్ని కాస్తయినా తగ్గించిన వారిమవుతామని తెలిపింది.

తన భర్త సాయంతో ఆపరేషన్ చేయించుకున్న చిన్నారితో పాటు ఆ చిన్నారి తల్లి ఫొటోను ఆమె పోస్ట్ చేసింది. ఆ చిన్నారి ఆపరేషన్ సక్సెస్ అయిందనందుకు సంతోషంగా ఉందని తెలిపింది. ఆ చిన్నారిని, ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడని చెప్పింది. మహేశ్ బాబు చేస్తోన్న సేవల పట్ల నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
namrata
Mahesh Babu
Tollywood

More Telugu News