Congress: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయం: అఖిలేశ్‌ యాదవ్‌ కీలక ప్రకటన

no alliance with congress
  • కాంగ్రెస్‌తో ఎట్టి పరిస్థితుల్లో కలవబోం
  • చిన్న పార్టీలతో మాత్రమే కలిసే అవకాశాలు
  • ఇప్పటికే పలు వేదికలపై తెలిపాను
ఉత్తరప్రదేశ్‌లో  2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తాము కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తెలిపారు.  తాము కొన్ని రోజులుగా లక్నో, ఏటవాలో పార్టీ ప్రముఖులతో సమావేశాలు జరిపామని ఆయన తెలిపారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో తాము ఎట్టి పరిస్థితుల్లో కలవబోమని, రాష్ట్రంలోని చిన్న పార్టీలతో మాత్రమే కలిసే అవకాశాలు ఉ‍న్నాయని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తాను పలు వేదికలపై తెలిపానని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల అభివృద్ధిని బీజేపీ సర్కారు పట్టించుకోలేదని చెప్పారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు మాత్రమే ప్రభుత్వం పరిమితమైందని విమర్శించారు.


Congress
Uttar Pradesh

More Telugu News