కేన్సర్‌ సోకిన చిన్నారి కోరికను తీర్చడానికి బాట్మాన్‌ వేషం వేసిన వైద్యుడు.. వీడియో ఇదిగో

15-11-2020 Sun 11:34
  • అమెరికాలో ఘటన
  • చిన్నారికి ఇష్టమైన బ్యాట్మాన్‌లా వచ్చిన వైద్యుడు
  • హత్తుకున్న చిన్నారి
doctor video goes viral

తన దగ్గర చికిత్స తీసుకుంటోన్న ఓ చిన్నారి కోరికను తీర్చడం కోసం ఓ వైద్యుడు బాట్మాన్ వేషం వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. చిన్నారి కోరిక తీర్చడానికి వైద్యుడు చేసిన ప్రయత్నాలపై నెటిజన్లు ప్రశంసల జల్లుకురిపిస్తున్నారు. అమెరికాలోని నార్త్‌ డకోటాకు చెందిన ఓ బాలుడు (5) కేన్సర్‌తో బాధపడుతున్నాడు.

నీ  కోరిక ఏంటి? అని ఆ చిన్నారిని అతడికి చికిత్స అందిస్తోన్న వైద్యుడు‌ అడిగారు. తన అభిమాన సూపర్‌ హీరో బాట్మాన్‌ను‌ కలవాలని ఉందని ఆ చిన్నారి తెలిపాడు. దీంతో ఆ డాక్టర్‌ బాట్మాన్‌ వేషం వేసి ఆ చిన్నారి వద్దకు వచ్చాడు. తన ఆసుపత్రి కారిడార్‌లో చిన్నారికి ఎదురుగా వచ్చి, దగ్గరకు పిలిచి తనని హత్తు కోవాలని చెప్పాడు. ఆ బాలుడు హత్తుకున్నాడు. కేన్సర్ తో ధైర్యంగా పోరాడాలని బాట్మాన్ ఆ చిన్నారికి చెప్పాడు. ఈ చిన్నారి త్వరగా కోలుకోవాలని నెటిజన్లు కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.