నిన్న ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో వెలుగుచూసిన కరోనా కేసులు

15-11-2020 Sun 09:12
  • తగ్గినట్టే తగ్గి మళ్లీ చెలరేగిపోతున్న కరోనా వైరస్
  • గడిచిన 24 గంటల్లో  6,57,312 కేసులు 
  • ఇన్ని కేసులు ఇదే తొలిసారన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
657312 corona cases registered in 24 hours all over world

కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా యూరప్‌లో చాలా దేశాలు మళ్లీ లాక్‌డౌన్ ప్రకటించాయి. మరికొన్ని ఆ దిశగా ఆలోచిస్తున్నాయి. అయినప్పటికీ వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తొలిరోజుల్లానే మళ్లీ చెలరేగిపోతోంది. నిన్న ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 6,57,312 కేసులు నమోదయ్యాయి. అలాగే, 9,797 మంది ప్రాణాలు కోల్పోయారు.

24 గంటల్లో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. నిన్న వెలుగుచూసిన కేసుల్లో అత్యధికం యూరప్, అమెరికాలో నమోదైనవే కావడం గమనార్హం. తాజా మరణాలతో కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 13,00,576 మంది కరోనాకు బలయ్యారు. అత్యధిక కరోనా కేసుల జాబితాలో అమెరికా ముందుండగా, ఆ తర్వాతి స్థానాల్లో భారత్, బ్రెజిల్, ఫ్రాన్స్, రష్యాలు దేశాలు ఉన్నాయి.