బీజేపీ సీనియర్ నేత కైలాష్ సారంగ్ కన్నుమూత!

15-11-2020 Sun 07:32
  • గత కొన్ని రోజులుగా అనారోగ్యం
  • ముంబైలోని ఆసుపత్రిలో తుది శ్వాస
  • సంతాపం తెలిపిన ప్రధాని
BJP Senior Leader Kailash Sarang Died

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత కైలాష్ సారంగ్ కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు.వృద్ధాప్యం కారణంగా అనారోగ్యం బారిన పడ్డ కైలాష్, ముంబైలోని ఓ ఆసుపత్రిలో గత 12 రోజులుగా చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి మరణించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కైలాష్ కుమారుడు విశ్వాస్ సారంగ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.

కైలాష్ మరణవార్తను గురించి తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. రాష్ట్రాభివృద్ధికి ఆయనెంతో శ్రమించారని, ఆయన కుటుంబీకులకు తన సంతాపాన్ని తెలుపుతున్నానని ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.