Tulasi Reddy: ఇదేం భజన జగన్..?: స్వరూపానంద అంశంలో తులసిరెడ్డి వ్యాఖ్యలు

Tulasi Reddy slams government decision over Swaroopananda birthday celebrations
  • స్వరూపానంద జన్మదినం ఆలయాల్లో జరపాలని ఆదేశాలు
  • భక్తిని వ్యక్తిగతంగా చూపించుకోవాలన్న తులసిరెడ్డి
  • ఆలయాల్లో జన్మదినం జరపడమేంటని ఆగ్రహం
స్వరూపానంద స్వామి పుట్టినరోజు వేడుకలను ఆలయాల్లో అధికారికంగా జరపాలని ఏపీ సర్కారు ఉత్తర్వులు ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి స్పందించారు. భక్తి ఉంటే పార్టీ పరంగానో, వ్యక్తిగతంగానో చూపించుకోవాలే తప్ప ప్రభుత్వం నుంచి ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం సరికాదని అన్నారు. సీఎం జగన్ కు స్వరూపానంద స్వామి భజన ఎక్కువైందని వ్యంగ్యం ప్రదర్శించారు. రాష్ట్రంలో రౌడీల రాజ్యం సాగుతోందని విమర్శించారు.

స్వరూపానంద జన్మదినాన్ని ఆలయాల్లో జరపడం ఏంటని ప్రశ్నించారు. శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద ఈ నెల 18న జన్మదినం జరుపుకుంటున్నారు. అయితే, ఆయన పుట్టినరోజు సందర్భంగా 23 ప్రముఖ దేవస్థానాల్లో ప్రత్యేక మర్యాదలు చేయాలంటూ సర్కారు ఆదేశాలిచ్చింది.
Tulasi Reddy
Swaroopananda
Birthday
Jagan
Andhra Pradesh

More Telugu News