కె.విశ్వనాథ్ దంపతులతో గడిపిన సమయం సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చింది: చిరంజీవి

14-11-2020 Sat 18:14
  • కె.విశ్వనాథ్ నివాసానికి వెళ్లిన చిరంజీవి
  • కళాతపస్వి దంపతులకు నూతన వస్త్రాల బహూకరణ
  • పండుగ రోజున ఆత్మీయుడ్ని కలిశానని చిరంజీవి ట్వీట్
Chiranjeevi talks about his visit to K Viswanath house on Diwali

నేడు దీపావళి పర్వదినం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన అర్ధాంగి సురేఖతో కలిసి 'కళాతపస్వి' కె.విశ్వనాథ్ నివాసానికి వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై చిరంజీవి స్పందించారు. పండుగ అంటే మన ఆత్మీయులను కలవడం, ఇంట్లో మన పెద్దవాళ్లతో సమయం గడపడం అని తెలిపారు. అందుకే ఈ పండుగ రోజున కె.విశ్వనాథ్ గారిని కలిశానని వెల్లడించారు.

తమ సినిమా కుటుంబంలోని పెద్దాయన, తనకు గురువు, మార్గదర్శి, ఆత్మబంధువు అయిన కె.విశ్వనాథ్ గారి నివాసానికి వెళ్లి ఆ దంపతులను సత్కరించుకున్నానని చిరంజీవి వివరించారు. కె.విశ్వనాథ్ దంపతులతో గడిపిన సమయం సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చిందని పేర్కొన్నారు.