Diwali: అభిమానులకు దీపావళి గిఫ్ట్.. చాలా రోజుల తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చి హాయ్ చెప్పిన రజనీకాంత్

 rajinikanth  Greets Fans On The Occasion Of Diwali Today
  • చెన్నైలోని రజనీ ఇంటి వద్దకు భారీగా వచ్చిన ఫ్యాన్స్ 
  • అభిమానులకు పండుగ శుభాకాంక్షలు చెప్పిన రజనీ
  • ఇటీవల అనారోగ్యం పాలైన హీరో 
దీపావళి సందర్భంగా సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్‌ అభిమానులు చెన్నైలోని ఆయన ఇంటి వద్దకు భారీగా తరలివచ్చారు. దీంతో వారిని చూసేందుకు రజనీకాంత్ బయటకు వచ్చారు. అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, రజనీకాంత్ ఇటీవల అనారోగ్యంపాలైన విషయం తెలిసిందే. ఆయన కోలుకోవాలని అభిమానులు పూజలు కూడా చేశారు.

ఆయన రాజకీయాల్లోకి ఇక రారని ఇటీవల వదంతులు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రజనీకాంత్ ఇంటికి  అభిమానులు కొన్ని రోజుల ముందు కూడా తరలి వచ్చి, ఆయన రాజకీయాల్లోకి రావాలంటూ నినాదాలు చేసి వెళ్లిపోయారు. దీపావళి సందర్భంగా రజనీని చూసేందుకు మళ్లీ ఈ రోజు బారులు తీరారు.

కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో రజనీకాంత్ కొన్ని నెలల నుంచి అభిమానుల ముందుకు రాలేదు. దీపావళి సందర్భంగా ఆయన అభిమానులకు దర్శనం ఇవ్వడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్ బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Diwali
Rajinikanth
Tollywood
Tamilnadu

More Telugu News