Rajiv Kanakala: సుమతో గొడవలు పెద్దవేం కాదు... ఇప్పుడు లేవు: రాజీవ్ కనకాల 

Rajiv Kanakala clarifies media stories
  • సుమ, రాజీవ్ మధ్య విభేదాలంటూ గతంలో ప్రచారం
  • ఇలాంటి ప్రచారం సరికాదన్న రాజీవ్
  • భార్యభర్తల మధ్య గొడవలు సహజమేనని వివరణ
టాలీవుడ్ లోని సెలబ్రిటీ కపుల్స్ లో రాజీవ్ కనకాల, సుమ కూడా ఉంటారు. రాజీవ్ నటుడిగా ఎంతో బిజీ. టెలివిజన్ యాంకర్ గా, సినీ ఆడియో ఫంక్షన్ల సంధానకర్తగా సుమ ఊపిరి సలపనంత బిజీగా ఉంటుంది. వీరిద్దరిదీ ప్రేమ వివాహం.

అయితే కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, సుమ గచ్చిబౌలిలో, రాజీవ్ మణికొండలో వేరుగా ఉంటున్నారని ప్రచారం జరిగింది. అయితే కొన్నిరోజులుగా సుమ సోషల్ మీడియాలో పంచుకుంటున్న ఫొటోలు చూస్తే వీరిమధ్య గొడవలేమీ లేవని, ఇద్దరూ సంతోషంగానే ఉన్నారని తెలుస్తుంది. దీనిపై రాజీవ్ ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు.

కాపురం అన్న తర్వాత గొడవలు సాధారణం అని, అయితే వాటిని పెద్దవి చేసి చూడకూడదని స్పష్టం చేశారు. సుమతో విభేదాలు వచ్చిన మాట నిజమే అయినా, అవి విడాకులు తీసుకునేంత పెద్దవేమీ కాదని పేర్కొన్నారు. తమ విభేదాలను మీడియా భూతద్దంలో చూపించిందని, తాము విడిపోయాం అన్నట్టుగా ప్రచారం చేసిందని అన్నారు. ప్రస్తుతం తమ మధ్య ఎలాంటి సమస్యలు లేవని, అన్నీ సమసిపోయాయని రాజీవ్ వెల్లడించారు.
Rajiv Kanakala
Suma
Rift
Media
Tollywood

More Telugu News