కేటీఆర్ ని ఫొటో తీసిన చిన్నారి.. ముచ్చటపడిన మంత్రి!

14-11-2020 Sat 10:44
  • హైదరాబాద్ లోని సనత్ నగర్ లో నిన్న కేటీఆర్ పర్యటన
  • పలు చోట్ల ప్రసంగాలు
  • ఆ సమయంలో ఫొటో తీసిన చిన్నారి
  • చిన్నారి తన హృదయాన్ని దోచుకున్నాడన్న మంత్రి  
 This kid stole my heart
హైదరాబాద్ లోని సనత్ నగర్ లోని నెహ్రూ పార్క్ లో థీమ్ పార్క్ నిర్మాణానికి నిన్న తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అలాగే, ఆ ప్రాంతంలో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా పలు చోట్ల కేటీఆర్ ప్రసంగాలు చేశారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి స్మార్ట్‌ఫోనులో కేటీఆర్ ఫొటోను చాలా చక్కగా తీశాడు. ఈ విషయాన్ని గుర్తించిన కేటీఆర్.. ఆ బాలుడు ఫొటో తీస్తుండగా మరొకరు తీసిన అతడి ఫొటోను కేటీఆర్ పోస్ట్ చేశారు.

‘ఈ చిన్నారి నా హృదయాన్ని దోచుకున్నాడు . నిన్న సనత్ నగర్ నియోజకవర్గంలో పర్యటించాను. పలు వేదికలపై మాట్లాడాను. ఆ బాలుడు ఈ ఫొటోను ఎక్కడ తీశాడో కచ్చితంగా తెలియదు. కానీ, ఈ చిన్నారి బాగా ఫోకస్ పెట్టి తన పని కానిచ్చాడు’ అంటూ కేటీఆర్ నవ్వుతూ ఉన్న ఎమోజీని పోస్ట్ చేశారు.