Narendra Modi: ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి: ప్రజలకు మోదీ శుభాకాంక్షలు

PM Modi wishes on Diwali festival
  • ఆయురారోగ్యాలతో సుసంపన్నంగా జీవించాలని ఆకాంక్ష
  • ఎప్పటిలానే ఈసారి కూడా సైనికులతోనే ప్రధాని దీపావళి
  • రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, అమిత్ షా దీపావళి శుభాకాంక్షలు
దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితంలోనూ మరిన్ని వెలుగులు నింపాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుసంపన్నంగా జీవించాలని ఆకాంక్షించారు. కాగా, మోదీ ఈసారి కూడా దీపావళిని సరిహద్దులలో సైనికులతో కలిసి జరుపుకోబోతున్నట్టు తెలుస్తోంది.

సరిహద్దుల్లో కాపలా కాస్తూ మనల్ని అనుక్షణం రక్షిస్తున్న సైనిక కుటుంబాలకు మనం రుణపడి ఉన్నామని, వారికి వందనం సమర్పిస్తూ  దీపావళికి ఒక ప్రమిదను వెలిగించాలని ప్రధాని నిన్న ట్వీట్ చేశారు. అలాగే, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోంమంత్రి అమిత్‌షాలు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.
Narendra Modi
Ram Nath Kovind
Venkaiah Naidu
Amit Shah
Deepavali

More Telugu News