Maryam Nawaz: నా జైలు గది, బాత్రూముల్లో కెమెరాలను ఉంచారు: నవాజ్ షరీఫ్ కుమార్తె

  • మహిళనైన నా పట్ల దారుణంగా వ్యవహరించారు
  • వాస్తవాలను చెపితే ఈ ప్రభుత్వం మొహాన్ని కూడా చూపించలేదు
  • ఏ మహిళ కూడా బలహీనురాలు కాదు
Cameras Were Installed In My Jail Cell and Bathroom says Nawaz Sharifs Daughter

పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పాకిస్థాన్ ముస్లింలీగ్ నవాజ్ పార్టీ ఉపాధ్యక్షురాలైన మర్యం నవాజ్ సంచలన ఆరోపణలు చేశారు. తన జైలు గదితో పాటు, బాత్రూమ్ లో కూడా అధికారులు కెమెరాలను పెట్టారని ఆమె అన్నారు. చౌదరి షుగర్ మిల్స్ కేసులో గత ఏడాది ఆమె జైలుకు వెళ్లారు.

అప్పుడు తాను అనుభవించిన ఇబ్బందుల గురించి జియో న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తాను రెండు సార్లు జైలుకు వెళ్లానని చెప్పారు. ఒక మహిళనైన తన పట్ల వ్యవహరించిన తీరును చెపితే... ఈ ప్రభుత్వం ఎవరికీ మొహాన్ని కూడా చూపించలేదని అన్నారు. తనను ఉంచిన సెల్ తో పాటు, బాత్రూమ్ లో కూడా కెమెరాలను ఉంచి తనను ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. ప్రపంచంలో ఏ మహిళ కూడా బలహీనురాలు కాదని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలకు తాము వ్యతిరేకం కాదని.. రాజ్యాంగానికి లోబడి మిలిటరీ వ్యవస్థతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధమని చెప్పారు. అయితే తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగిస్తేనే తాము చర్చలు జరుపుతామని అన్నారు.

More Telugu News