Rahul Gandhi: రాహుల్ గాంధీ‌లో ఏదో తెలియని భయం ఉంది: అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా

  • ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’ పుస్తకంలో రాసిన ఒబామా
  • టీచర్‌ను ఆకట్టుకోవడానికి ప్రయత్నించే విద్యార్థిలా ఉంటారు
  • విషయం గురించి లోతుగా నేర్చుకోవాలనే అభిరుచి లేదు
Rahul Gandhi like student eager to impress but lacks aptitude says Barack Obama

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన రాజకీయ అనుభవాలు, జీవిత జ్ఞాపకాలను గురించి రాసిన ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’ పుస్తకంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ గురించి కీలక విషయాలను ప్రస్తావించారు. రాహుల్‌లో ఏదో తెలియని భయం ఉందని ఆయన పేర్కొనడం గమనార్హం. స్కూల్ క్లాస్ రూమ్‌లో టీచర్‌ను ఆకట్టుకోవడానికి ప్రయత్నించే విద్యార్థిలా ఆయన‌ చాలా ఆత్రుతగా ఉంటాడని చెప్పారు.

ఆయనకు ఏదైనా ఓ విషయం గురించి లోతుగా నేర్చుకోవాలనే అభిరుచి లేదని ఒబామా వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం. ఈ పుస్తకంలో రాహుల్ గురించి బరాక్ ఒబామా రాసిన విషయాలను న్యూయార్క్ టైమ్స్  ఓ కథనంలో తెలిపింది. రాహుల్ గురించి మాత్రమే కాకుండా భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గురించి కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు న్యూయార్క్ టైమ్స్  తన కథనంలో ఇచ్చింది. రాహుల్‌ గాంధీ 2017లో ఒబామాను కలిశారు. ఆ సమయంలో ఇందుకు సంబంధించిన ఫొటోను రాహుల్ పోస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడి హోదాలో అప్పట్లో ఒబామా భారత్‌కు రెండు సార్లు వచ్చారు.

More Telugu News